• TFIDB EN
  • Editorial List
    Chiranjeevi as Police Officer Movies: చిరంజీవి పోలీస్ పాత్రల్లో నటించిన సినిమాలు
    Dislike
    2k+ views
    11 months ago

    మెగాస్టార్ చిరంజీవి చెయ్యని పాత్రంటూ లేదు. ఏ పాత్ర చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటాడు. తన కెరీర్‌‌లో ఎన్నో పోలీసాఫీసర్ పాత్రలు పోషించాడు. ఓ పోలీస్ అధికారికి ఉండే హుందా తనాన్ని చక్కగా ప్రదర్శిస్తూ అభినయం పండించేవాడు చిరంజీవి. డైలాగుల్లోనూ గాంభీర్యాన్ని చూపేవాడు. అలా చిరంజీవి పోలీస్ అధికారి పాత్రలు పోషించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. చిరు పోలీస్ ఆఫీసర్‌గా చేసిన సినిమాలు ఇవే.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గూడచారి నెం.1(జూన్ 30 , 1983)
    U|యాక్షన్,థ్రిల్లర్
    అక్రమ పేలుడు పదార్థాలను తయారు చేసే క్రిమినల్ ముఠా గట్టురట్టు చేసేందుకు సీబీఐ ఏజెంట్‌గా విజయ్‌(చిరంజీవి) ప్రత్యేక ఆపరేషన్‌ చేయాలని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ మిషన్‌లో విజయ్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది కథ.
    2 . రోషగాడు(జూలై 29 , 1983)
    A|యాక్షన్,డ్రామా
    సికిందర్(చిరంజీవి) ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. తరువాత జరిగే వెంటాడే సీనులో సికిందర్ ప్రమాదానికి గురవుతాడు. ఆ తర్వాత సికిందర్‌ పోలికలతో శ్రీకాంత్ వచ్చినప్పుడు అతన్ని స్మగ్లర్లు పట్టుకుంటారు. ఇంతకు శ్రీకాంత్, సికిందర్ ఒక్కరేనా?
    3 . రక్త సింధూరం(ఆగస్టు 24 , 1985)
    A|యాక్షన్,డ్రామా
    ఉరిశిక్ష నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక నేరస్థుడు, గోపీ అనే నిజాయితీ గల పోలీసు అధికారిని వడ్డీ వ్యాపారి బంధించిన కార్మికుడిని రక్షించేలా చేస్తాడు.
    4 . ముగ్గురు మొనగాళ్లు(జనవరి 07 , 1994)
    U|యాక్షన్,డ్రామా
    ముగ్గురు కవల సోదరులు తమ తండ్రిని హత్య చేసిన దుండగుడి వల్ల పుట్టుకతోనే విడిపోతారు. వారు పెరిగి పెద్దయ్యాక కలుసుకుని తమ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయల్దేరుతారు.
    5 . ఖైదీ నం. 786(జూన్ 10 , 1988)
    U|యాక్షన్,డ్రామా
    తండ్రికి ఇష్టం లేకుండా ఓ యువతిని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తప్పుడు కేసులో ఇరికించబడుతాడు. అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, తన మామకు గుణపాఠం చెప్పడానికి కష్టపడతాడు.
    6 . స్టువర్టుపురం పోలీస్ స్టేషన్(జనవరి 09 , 1991)
    U|యాక్షన్,డ్రామా
    స్టూవర్ట్‌పురం గ్రామస్తులు పోలీసులను అసహ్యించుకుంటారు. వారిని తమను అణచివేసే శక్తిగా భావిస్తారు. ఆ తర్వాత రాణా ప్రతాప్ అనే పోలీస్ వచ్చి వారికి పోలీసులపై ఉన్న భయాన్ని పొగొడుతాడు.
    7 . స్టేట్ రౌడీ(మార్చి 23 , 1989)
    U|యాక్షన్,డ్రామా
    పోలీసు అధికారి కావాలనుకున్న ఓ యువకుడు అవినీతి రాజకీయాల వల్ల తన కలను నెరవేర్చుకోలేకపోతాడు. దీంతో తన జీవిత గమనాన్ని మార్చుకుంటాడు. అతను చట్టానికి వ్యతిరేకంగా మారి.. ఎలాంటి పనులు చేశాడన్నది కథ.
    8 . ఎస్పీ పరశురాం(జూన్ 15 , 1994)
    U|యాక్షన్
    ఒక నిజాయితి గల పోలీస్‌ ఆఫీసర్ తన సొంత తమ్ముడు బ్లూఫిల్మ్ కేసులో ఇరుక్కున్నప్పుడు విధి నిర్వాహణ, కుటుంబ బంధాల మధ్య నలిగిపోతాడు. తన తమ్ముడిని నిర్దోషిగా నిరూపించేందుకు ఉన్న ఏకైక సాక్షిని కాపాడేందుకు పోరాడుతాడు.
    9 . యమకింకరుడు(అక్టోబర్ 22 , 1982)
    A|129 min|యాక్షన్,డ్రామా
    చిన్ననాటి స్నేహితులైన కిషోర్ మరియు విజయ్ ఇద్దరు పోలీస్ అధికారులుగా పనిచేస్తుంటారు. జాకల్‌ అనే నేరస్థున్ని పట్టుకుని జైళ్లో వేస్తారు. అయితే జాకల్ జైలు నుండి తప్పించుకుని కిషోర్‌ని చంపేస్తాడు.

    @2021 KTree