Editorial List
చిరంజీవి టాప్ కామెడీ సినిమాల లిస్ట్ ఇదే
30+ views1 month ago
చిరంజీవి కామెడీ టైమింగే వేరు. ‘హలో మాస్టారూ’ అన్నా, ‘ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో’ అని చెప్పినా కామెడీ పండాల్సిందే. సీరియస్ టోన్‌లోనూ కడుపుబ్బా నవ్వించే సత్తా చిరంజీవి సొంతం. స్క్రీన్‌పై వేరియేషన్లను చూపిస్తూ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయగలడు ఈ మెగాస్టార్. తన కెరీర్‌లో చేసిన 150కు పైగా సినిమాల్లో కామెడీ డోజున్న చిత్రాలు ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1 . రాణి కాసుల రంగమ్మ(ఆగస్టు 01 , 1981)
U|114 min|డ్రామా,రొమాన్స్
ధనిక పారిశ్రామిక వేత్త కొడుకు సుకుమార్ అమాయక పల్లెటూరి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుంటాడు. ఓ యువతి తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో సుకుమార్‌కు గుణపాఠం చెప్పాలని ఇద్దరు కుట్ర పన్నుతున్నారు.
2 . పట్నం వచ్చిన పతివ్రతలు(అక్టోబర్ 01 , 1982)
U|యాక్షన్,డ్రామా
ఇద్దరు పెళ్లైన మహిళలు పట్టణంలో జీవించాలని కలలు కంటారు. కానీ పట్టణంలో జీవించడం వారి భర్తలకు ఇష్టం ఉండదు. దీంతో వారి భర్తలకు తెలియకుండా పట్టణానికి పారిపోతారు.
3 . మంత్రి గారి వియ్యంకుడు(నవంబర్ 04 , 1983)
U|133 minutes|యాక్షన్,డ్రామా
సుబ్బారావు అనే కోటీశ్వరుడు, వారి పిల్లల పెళ్లి గురించి చర్చిస్తూ తన స్నేహితుడిని అవమానిస్తాడు. అయితే, ఆ స్నేహితుడి కొడుకు బాబ్జీ తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేస్తాడు.
4 . ఆరాధన(మార్చి 27 , 1987)
U|మ్యూజికల్,రొమాన్స్
పులిరాజు నిత్య తాగుబోతు, అందరినీ వేధిస్తుంటాడు. అయితే అతని గ్రామంలోకి జెన్నీ టీచర్ వస్తుంది. అతని మూర్ఖత్వాన్ని అతనికి తెలుసుకునేలా చేస్తుంది. దీంతో అతని జీవితం కీలక మలుపు తిరుగుతుంది.
5 . జేబు దొంగ(డిసెంబర్ 25 , 1987)
U|యాక్షన్,థ్రిల్లర్
ఒక టెర్రరిస్టును ట్రాప్ చేయడానికి చిట్టిబాబు అనే జేబు దొంగను సీబీఐ అతనికి తెలియకుండానే తమ సీక్రెట్ ఏజెంట్‌గా ఉపయోగించుకుంటుంది. చివరకు నిజం తెలుసుకున్న చిట్టిబాబు ఉగ్రవాదిని పట్టుకునేందుకు సాయం చేస్తాడు.
6 . అల్లుడా మజాకా(ఫిబ్రవరి 25 , 1995)
A|యాక్షన్,డ్రామా
ధనవంతుడు కొడుకు అయిన సీతారం సంపదను శత్రువులు దోచుకుంటారు. అన్యాయంగా అతడ్ని హత్య కేసులో ఇరికించి జైలుకు పంపుతారు. జైలు నుంచి బయటకొచ్చిన సీతారాం ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
7 . రిక్షావోడు(డిసెంబర్ 14 , 1995)
U|యాక్షన్,డ్రామా
రాజు (చిరంజీవి) బతుకు తెరువు కోసం రిక్షా తొక్కుతూ జీవిస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు పరేష్ రావల్ కూతురు రాణి(నగ్మా)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే తన కుటుంబం రోడ్డుపైకి రావడానికి పరేష్ రావల్ కారణమని నానమ్మ (మనోరమ) ద్వారా రాజు తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేశాడన్నది అసలు కథ.
8 . హిట్లర్(జనవరి 04 , 1997)
U|153 minutes|డ్రామా
మాధవరావుకి తన ఐదుగురు చెల్లెళ్లంటే ప్రాణం. క్రూరమైన సమాజం నుండి చెల్లెళ్లను రక్షించే క్రమంలో వారి పట్ల కాస్త కఠినంగా ఉంటాడు. సిస్టర్స్ తన అన్నకు ఎదురు తిరిగినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
9 . రౌడీ అల్లుడు(అక్టోబర్ 18 , 1991)
U|డ్రామా,థ్రిల్లర్
కళ్యాణ్ ఒక పారిశ్రామికవేత్త, అతని శత్రువులు కుట్ర పన్ని అతని స్థానంలో జానీ అనే మోసగాడిని పంపిస్తారు. అయితే కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలుసుకున్న జానీ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
10 . అందరివాడు(జూన్ 04 , 2005)
UA|162 minutes|హాస్యం
గోవిందరాజులు (చిరంజీవి) అనే మేస్త్రికి టెలివిజన్ షోను నడిపించే సిద్ధార్థ్ (చిరంజీవి) కుమారుడు. సిద్ధార్థ్ చిన్నతనంలోనే తల్లి మరణిస్తే గోవిందరాజులు తన కొడుకు కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుండా అతన్ని ప్రేమగా పెంచుతాడు. సిద్ధార్థ్ ఒక టీవీ ఛానల్‌లో రిపోర్టరుగా పనిచేస్తుంటాడు. అయితే, సిద్ధార్థ్ ఓ కాంట్రాక్టర్ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత గోవిందరాజులు దూరమయ్యే అవకాశం ఏర్పడుతుంది.
11 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
U|151 minutes|యాక్షన్,థ్రిల్లర్
రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.
12 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.
13 . ముఠా మేస్త్రి(జనవరి 17 , 1993)
U|యాక్షన్,డ్రామా
బోసు (చిరంజీవి) ఒక దేశభక్తి గలవాడు. కూరగాయల మార్కెట్‌లో కూలివారికి అన్యాయం జరగకుండా కాపాడుతుంటాడు. ఆత్మా (శరత్ సక్సేనా) ఆ ప్రాంతంలో ఒక ముఠా నాయకుడు. బోసు అతనికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. బోసు దేశభక్తిని మెచ్చిన సీఎం (గుమ్మడి వెంకటేశ్వర రావు) అతడ్ని మంత్రిగా చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది అసలు కథ.
14 . జగదేక వీరుడు అతిలోక సుందరి(మే 09 , 1990)
U|యాక్షన్,ఫ్యామిలీ
నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది.
15 . ఆపద్బాంధవుడు(అక్టోబర్ 09 , 1992)
U|డ్రామా,మ్యూజికల్
మాధవ తన యాజమాని కూతురు హేమతో ప్రేమలో పడుతాడు. అయితే సామాజిక కట్టుబాట్ల కారణంగా తన ప్రేమను బయటపెట్టడు. కానీ హేమ అకస్మాత్తుగా మెంటల్ ఆస్పత్రిలో చేరినప్పుడు.. ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
16 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
A|యాక్షన్,డ్రామా
ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
17 . అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(జనవరి 14 , 1989)
U|140 minutes|డ్రామా
కళ్యాణ్ సోదరి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. అహంకారి అయిన తల్లికి భయపడి ఆ వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్ రంగంలోకి దిగి తల్లికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ఇందుకు ఆమె కూతురు సాయం చేస్తుంది.
18 . చంటబ్బాయి(ఆగస్టు 22 , 1986)
U|హాస్యం,డ్రామా
పాండు రంగారావు ఒక డిటెక్టివ్, జేమ్స్ పాండ్‌గా ప్రసిద్ధి చెందాడు. ఒక మహిళ తప్పిపోయిన తన సోదరుడిని కనిపెట్టేందుకు పాండు రంగారావును కలవడంతో అతని జీవితం ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
19 . బావగారూ బాగున్నారా!(ఏప్రిల్ 09 , 1998)
U|రొమాన్స్
న్యూజిలాండ్‌లో రాజు, స్వప్న ప్రేమించుకుంటారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఆత్మహత్యకు యత్నిస్తున్న ప్రెగ్నెంట్ మహిళను రాజు కాపాడతాడు. సాయం చేసేందుకు భర్తగా ఆమె ఇంటికి వెళ్తాడు. కడుపుతో ఉన్న మహిళ స్వప్నకు సోదరి కావడంతో కథ మలుపు తిరుగుతుంది.
20 . అన్నయ్య(జనవరి 07 , 2000)
UA|157 mins|హాస్యం,డ్రామా
రాజారామ్ తన ఇద్దరు తమ్ముళ్లను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. వారు చేసే అల్లరి పనులను ఎప్పుడూ క్షమిస్తుంటాడు. ఒక సంఘటన వల్ల రాజారామ్ తన తమ్ముళ్లను ఇంట్లో నుంచి గెంటి వేస్తాడు. కానీ వారికి రహస్యంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అయితే రాజారామ్ తమ్ముళ్లు మాత్రం అతన్ని ద్వేషించుకుంటారు.