• TFIDB EN
  • Editorial List
    Chiranjeevi Negative Roles Movies: చిరంజీవి ప్రతినాయక పాత్రలు పోషించిన చిత్రాలు
    Dislike
    3k+ views
    1 year ago

    కెరీర్‌లో 150కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలను పోషించాడు. తొలి నాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన సందర్భాలున్నాయి. హీరోగానే కాకుండా, ప్రతి నాయక పాత్రల్లోనూ చిరంజీవి మెప్పించడం విశేషం. పాత్ర ఏదైనా నటుడిగా నిరూపించుకోవాలన్న తపన చిరంజీవిని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. చిరంజీవి నెగెటివ్ రోల్ చేసిన సినిమాలేంటో చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . బందిపోటు సింహం(అక్టోబర్ 26 , 1981)
    A|152 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
    ఈ మూవీలో చిరంజీవి, రజనీకాంత్‌ ప్రాణ స్నేహితులుగా చేశారు. చిరంజీవి, రజనీకాంత్ మధ్య వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను రంజింపజేస్తాయి. రజనీ సరసన శ్రీదేవీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
    2 . రాణి కాసుల రంగమ్మ(ఆగస్టు 01 , 1981)
    U|114 min|డ్రామా,రొమాన్స్
    ధనిక పారిశ్రామిక వేత్త కొడుకు సుకుమార్ అమాయక పల్లెటూరి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుంటాడు. ఓ యువతి తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో సుకుమార్‌కు గుణపాఠం చెప్పాలని ఇద్దరు కుట్ర పన్నుతున్నారు.
    3 . పున్నమి నాగు(జూన్ 13 , 1980)
    U|డ్రామా,రొమాన్స్
    నాగులు (చిరంజీవి) పాములను అడించుకునే వ్యక్తి. అతడి తండ్రి చిన్నప్పటి నుంచి పాము విషాన్ని కొంచెం కొంచెంగా ఆహారంలో కలిపి ఇవ్వడంతో అతడి శరీరం విషపూరితంగా మారుతుంది. నాగులు ప్రేమించిన పూర్ణిమ(మేనక) ఓ రోజు అనుమానస్పదంగా చనిపోతుంది. అలాగే ప్రతీ పౌర్ణమికి ఓ స్త్రీ ఆ ఊరిలో చనిపోతుంటుంది. అయితే ఆ మరణాలకు కారణం ఎవరు? చివరికీ నాగులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనేది అసలు కథ.
    4 . తిరుగు లేని మనిషి(ఏప్రిల్ 01 , 1981)
    U|138 mins|డ్రామా
    నిజాయితీ గల న్యాయవాది రాజా తన సోదరిని కిషోర్‌కు ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే కిషోర్‌ ఓ స్మగ్లింగ్‌లో పాలుపంచుకున్నట్లు తెలుసుకుంటాడు. అతడికి ఎదురైన విపత్కర పరిస్థితుల నుంచి కిషోర్‌ను కాపాడేందుకు యత్నిస్తాడు.
    5 . 47 రోజులు(జూలై 17 , 1981)
    A|డ్రామా
    నటి సరిత వైశాలితో మాట్లాడటానికి ఒక చిన్న పట్టణానికి వస్తుంది, ఎందుకంటే ఆమె తన జీవితం ఆధారంగా ఒక చిత్రంలో ఆమెతో నటించబోతోంది. వైశాలి హిస్టీరియాతో బాధపడుతూ, కోపంతో సరితను బయటకు పంపింది. ఈ కథ ఇప్పుడు ఫ్లాష్‌బ్యాక్ రూపంలో చెప్పబడింది, వైశాలి సోదరుడు సరితకు కుమార్‌తో తన వివాహం గురించి చెప్పినప్పుడు, అది కేవలం 47 రోజులు మాత్రమే.
    6 . న్యాయం కావాలి(మే 15 , 1981)
    A|డ్రామా
    భారతిని సురేష్‌ ప్రేమ పేరుతో మోసం చేస్తాడు. గర్భవతి అయిన ఆమె సురేష్‌ను కోర్టుకు ఈడ్చి నవ్వులపాలు చేయాలని నిర్ణయించుకుంటుంది.

    ఎ కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా న్యాయం కావాలి. శరత్‌కుమార్, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. చిరంజీవి ఇందులో నెగిటివ్ రోల్ చేశాడు.

    7 . మోసగాడు(మే 22 , 1980)
    U|యాక్షన్,డ్రామా
    పెళ్లి రోజున జగన్ కాబోయే భార్యపై ఓ రౌడీషీటర్ అత్యాచారానికి పాల్పడుతాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది. దీంతో ఆ రౌడీ షీటర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు జగన్ బయల్దేరుతాడు.

    దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చిరంజీవిని విలన్‌గా పెట్టి సినిమా తీశాడు. శోభన్ బాబు, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు.

    8 . ఇది కథ కాదు(జూన్ 27 , 1979)
    U|డ్రామా
    భర్తతో విడాకుల తర్వాత సుహాసిని ఒంటరిగా జీవిస్తుంటుంది. అయితే ఇద్దరు వ్యక్తులు ఆమెను ప్రేమిస్తారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు సుహాసినికి సమస్యలు ఎదురవుతాయి.

    కమల్ హాసన్, జయసుధ జంటగా నటించిన చిత్రమిది. ఇందులో చిరంజీవి ప్రతినాయక ఛాయ పాత్రలో నటించాడు. విలన్‌గా నటించిన తొలి సినిమా ఇదే. బాలచందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.


    @2021 KTree