2023లో చూడదగిన బెస్ట్ థ్రిల్లర్ చిత్రాలు
1 Likes 3k+ views1 year ago
2023 సంవత్సరంలో చాలా వరకు థ్రిల్లర్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో ప్రేక్షకులకు బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్‌ఫీరియన్స్ అందించే చిత్రాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో జైలర్, విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.
1 . జైలర్(ఆగస్టు 10 , 2023)
UA|థ్రిల్లర్,యాక్షన్
ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
2 . జవాన్(నవంబర్ 02 , 2023)
UA|యాక్షన్,థ్రిల్లర్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
3 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
A|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
4 . కథ వెనుక కథ(మే 12 , 2023)
UA|డ్రామా,థ్రిల్లర్
సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. తాను తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ
5 . సలార్(డిసెంబర్ 22 , 2023)
UA|థ్రిల్లర్,యాక్షన్
ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజ మన్నార్ (జగపతిబాబు) రూలర్. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఖాన్సార్‌కు రూలర్ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్) సాయం కోరతాడు. ఆ ఒక్కడు అంతమంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.
6 . మా ఊరి పొలిమేర 2(నవంబర్ 03 , 2023)
UA|క్రైమ్,హారర్,థ్రిల్లర్
ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ
7 . అన్వేషిప్పిన్ కండెతుమ్(ఫిబ్రవరి 09 , 2024)
UA|క్రైమ్,డ్రామా,థ్రిల్లర్
ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
8 . మంజుమ్మెల్ బాయ్స్(ఏప్రిల్ 06 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
9 . హసీనా(మే 19 , 2023)
A|డ్రామా,థ్రిల్లర్
జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత ఐదుగురు అనాథలు ఒక చిక్కులో పడతారు. ఆ చిక్కేంటి? తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా కథ.
10 . అనాటమీ ఆఫ్ ఎ ఫాల్(మే 21 , 2023)
UA|డ్రామా,థ్రిల్లర్
మంచు కొండల్లో సాండ్రా హుల్లర్ తన భర్తతో కలిసి జీవిస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె భర్త అనుమానస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ ప్రాంతంలో సాండ్రా తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమెనే ఈ హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తారు. ఇంతకి ఈ హత్య చేసింది ఎవరు? సాండ్రా దోషా లేక నిర్దోషా? అన్నది కథ.
11 . సరిపోదా శనివారం(ఆగస్టు 29 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్
సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. అక్కడ అరాచకం చేస్తున్న పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? అక్కడి వారికి ఏ విధంగా అండగా నిలిచాడు? అన్నది స్టోరీ. సరిపోదా శనివారం సినిమాను రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
12 . దేవర(సెప్టెంబర్ 27 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? అన్నది స్టోరీ. దేవర చిత్రాన్ని రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.
13 . టైగర్ నాగేశ్వరరావు(అక్టోబర్ 20 , 2023)
UA|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
టైగర్ నాగేశ్వరరావు(రవితేజ) అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు అనేది కథ.
14 . గామి(మార్చి 08 , 2024)
UA|అడ్వెంచర్,ఫాంటసీ,థ్రిల్లర్
అఘోరా శంకర్ (విష్వక్ సేన్) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్ ట్రైల్స్ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.
15 . సఖి(డిసెంబర్ 15 , 2023)
U|డ్రామా,రొమాన్స్,థ్రిల్లర్
కార్తిక్, శక్తి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వీరి కాపురంలో సమస్యలు మెుదవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
16 . హంట్(జనవరి 26 , 2023)
UA|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడుతాడు. ప్రమాదం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ప్రమాదానికి ముందు, తన స్నేహితుడు ACP ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) హత్య కేసును దర్యాప్తు చేస్తుంటాడు. ఇంతకు ఆర్యన్ దేవ్‌ను ఎవరు చంపారు? అర్జున్ జ్ఞాపకశక్తిని తిరిగి పొందాడా? అన్నది మిగతా కథ.
17 . డబల్ ఇస్మార్ట్(ఆగస్టు 15 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్,సైన్స్ ఫిక్షన్
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? అనేది కథ
18 . విదుతలై పార్ట్ 1(మార్చి 31 , 2023)
UA|క్రైమ్,డ్రామా,థ్రిల్లర్
పోలీస్ డ్రైవర్ కుమారేశన్‌కు ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ నక్సలైట్లు, పోలీసులకు మధ్య నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్ పెరుమాళ్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు కుమారేశన్ ప్రేయసిని అరెస్టు చేస్తారు. చిత్ర హింసలు పెడతారు. అది చూడలేక కుమారేశన్ ఏం చేశాడు? పెరుమాళ్ ఆచూకిని ఎలా కనిపెట్టాడు? పెరుమాళ్ కోసం పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? అన్నది కథ.
19 . మెర్రీ క్రిస్మస్(జనవరి 12 , 2024)
UA|డ్రామా,థ్రిల్లర్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
20 . IB71(మే 12 , 2023)
UA|యాక్షన్,థ్రిల్లర్
1971లో ఘాజీ అటాక్ తర్వాత పాక్ చైనాతో కలిసి భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధపడుతుంది. ఇందులో భాగంగా ఇద్దరు కశ్మీర్ యువకులు భారత్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసి లాహోర్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? హైజాక్ అయిన వారిని హీరో ఎలా రక్షించాడు? అన్నది కథ.