• TFIDB EN
  • డిస్నీ హాట్‌ స్టార్‌లో బెస్ట్ కామెడీ చిత్రాలు
    Dislike
    1 Likes 2k+ views
    1 year ago

    హాట్‌స్టార్‌లో 2018-2023 వరకు వచ్చిన కామెడీ చిత్రాల్లో బెస్ట్ స్ట్రీమింగ్ రేటింగ్ ఉన్న టాప్ చిత్రాలను YouSay TFIDB సేకరించింది. వీటిలో ప్రతిరోజు పండగే, మీకు మాత్రమే చెప్తా వంటి చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . డెడ్‌పూల్ & వుల్వరైన్(జూలై 26 , 2024)
    A|యాక్షన్,హాస్యం,డ్రామా
    డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్‌ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్‌ - వాల్వెరైన్‌ చేసిన సాహసాలు ఏంటి? అన్నది స్టోరీ.
    2 . ప్రతి రోజు పండగే(డిసెంబర్ 20 , 2019)
    U|హాస్యం,డ్రామా
    తన తాత రఘు రామయ్య చివరిరోజుల్లో సంతోషం ఉండాలని సాయి కోరుకుంటాడు. రఘు రామయ్య పిల్లలు అతన్ని పరామర్శించేందుకు కూడా ఇష్టపడరు. దీంతో సాయి ఏం చేశాడు. వారిని ఎలా రప్పించాడు అనేది సినిమా కథ
    3 . మీకు మాత్రమే చెప్తా(నవంబర్ 01 , 2019)
    UA|హాస్యం
    రాకేష్ తన కాబోయే భర్యను సంతోషంగా ఉంచేందుకు ఇకపై మద్యం తాగనని ఆమెకు మాట ఇస్తాడు. అయితే అతని పెళ్లికి రెండు రోజుల ముందు రాకేష్ మద్యం సేవించిన వీడియో లీక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ
    4 . రాజు గారి గది 3(అక్టోబర్ 18 , 2019)
    UA|హాస్యం,హారర్
    అశ్విన్, మాయ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకు ఒక ప్రేతాత్మ అడ్డుపడుతోందని తెలుసుకుంటారు. తమ జీవితాన్ని సాధారణ స్థితికి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్న అశ్విన్ ఏం చేశాడు అనేది కథ
    5 . మాస్ట్రో(సెప్టెంబర్ 17 , 2021)
    UA|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
    అంధుడైన అరుణ్‌ (నితిన్‌) రెస్టారెంట్‌లో పియానో వాయిస్తుంటాడు. అక్కడకు వచ్చే మోహన్‌ (నరేశ్‌) తమ వివాహ వార్షికోత్సవానికి ఇంటికి వచ్చి పియానో వాయించమని చెబుతాడు. అరుణ్‌ ఇంటికి వెళ్లే సరికి మోహన్‌ హత్యకు గరువుతాడు. ఇంతకీ ఆ హత్య చేసిందేవరు? మోహన్‌ భార్య సిమ్రన్‌ (తమన్నా)కు ఆ హత్యలో ఏమైనా ప్రమేయం ఉందా? అన్నది కథ.
    6 . కృష్ణ వ్రింద విహారి(సెప్టెంబర్ 23 , 2022)
    UA|హాస్యం,రొమాన్స్,డ్రామా
    కృష్ణాచారి (నాగశౌర్య) పల్లెటూరుకు చెందిన బ్రాహ్మణ కుర్రాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చి మేనేజర్‌గా పనిచేసే వ్రిందా (షిర్లే సేథియా)ను ప్రేమిస్తాడు. ఓ సమస్యతో బాధపడుతున్న వ్రిందా అతడితో పెళ్లికి నిరాకరిస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి? పెళ్లి కోసం కృష్ణ ఎన్ని అబద్దాలు ఆడాడు? అనేది మిగతా కథ.
    7 . ముంజ్య(జూన్ 07 , 2024)
    UA|హాస్యం,డ్రామా,హారర్
    1952లో తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెను దక్కించుకునేందుకు చేతబడి చేయబోతాడు. అయితే అది వికటించి పిల్ల దెయ్యం ముంజ్యగా మారతాడు. ప్రస్తుతం పుణెలో ఉంటున్న బిట్టు (అభయ్‌ వర్మ) అనుకోకుండా ముంజ్యకు విముక్తి కలిగిస్తాడు. ఆ ముంజ్య బిట్టును ఎన్ని ఇబ్బందులు పెట్టింది? దాని లక్ష్యం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.
    8 . గురువాయూర్ అంబలనాదయిల్(మే 16 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    రామచంద్రన్‌కు నిశ్చితార్థం జరిగినప్పటికీ బ్రేకప్‌ అయిన అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాడు. దీంతో బావమరిది ఆనంద్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌).. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు రామచంద్రన్‌కు సాయం చేస్తుంటాడు. అయితే ఓ వ్యక్తి కారణంగా వీరి బంధం బీటలు వారుతుంది. ఆ తర్వాత ఏమైంది? రామచంద్రన్‌ పెళ్లి చేసుకున్నాడా? ఆనంద్‌ తన భార్యను కలిశాడా? లేదా? అన్నది కథ.
    9 . ఫాలిమి (నవంబర్ 17 , 2023)
    U|హాస్యం,డ్రామా,ఫ్యామిలీ
    ఒక ఫ్యామిలీ తమ కుటుంబ పెద్ద కోరికను తీర్చేందుకు తీర్థయాత్రకు బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో వారికి అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. వాటి నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడింది? అన్నది కథ.
    10 . ప్రిన్స్‌(అక్టోబర్ 21 , 2022)
    UA|హాస్యం,రొమాన్స్
    స్కూల్ టీచర్‌గా చేసే ఆనంద్ (శివకార్తికేయన్) సహోద్యోగి జెస్సికా (బ్రిటిష్ యువతి)ని ప్రేమిస్తాడు. ఆనంద్‌ తండ్రి విశ్వనాథ్ (సత్యరాజ్) వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. అప్పుడు ఆనంద్‌ ఏం చేశాడు? కుమారుడి పెళ్లికి విశ్వనాథ్ ఎందుకు ఒప్పుకోలేదు? గ్రామస్తులు ఆనంద్‌ను వెలేయాలని ఎందుకు అనుకున్నారు? అన్నది స్టోరీ.

    @2021 KTree