2024 ఏడాదిలో వచ్చిన బెస్ట్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు!
80+ views1 month ago
ఈ ఏడాదిలో ఎన్ని సినిమాలు విడుదలైనప్పటికీ.. వాటిలో కామెడీ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైన సరే.. కొత్త ఏడాదిలోకి ఆనందంగా అడుగు పెట్టాలనుకుంటారు. అలాగే పాత ఏడాదికి సంతోషంగా విడ్కోలు చెప్పాలనుకుంటారు. మీకు సంతోషాన్ని పంచి కడుపుబ్బ నవ్వించే సినిమాల లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాం. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి మరి.
1 . ప్రేమలు(మార్చి 08 , 2024)
U|హాస్యం,రొమాన్స్
సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
2 . డెడ్‌పూల్ & వుల్వరైన్(జూలై 26 , 2024)
A|యాక్షన్,హాస్యం,డ్రామా
డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ - వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి? అన్నది స్టోరీ.
3 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
UA|హాస్యం,డ్రామా
క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
4 . టిల్లు స్క్వేర్(మార్చి 29 , 2024)
UA|హాస్యం,రొమాన్స్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
5 . ముంజ్య(జూన్ 07 , 2024)
UA|హాస్యం,డ్రామా,హారర్
1952లో తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెను దక్కించుకునేందుకు చేతబడి చేయబోతాడు. అయితే అది వికటించి పిల్ల దెయ్యం ముంజ్యగా మారతాడు. ప్రస్తుతం పుణెలో ఉంటున్న బిట్టు (అభయ్ వర్మ) అనుకోకుండా ముంజ్యకు విముక్తి కలిగిస్తాడు. ఆ ముంజ్య బిట్టును ఎన్ని ఇబ్బందులు పెట్టింది? దాని లక్ష్యం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.
6 . కొంచెమ్ హాట్కే(ఏప్రిల్ 26 , 2024)
A|హాస్యం,డ్రామా
కొంచెమ్ హాట్కే 2024లో విడుదలైన కామెడీ-డ్రామా చిత్రం. ఇందులో గురు చరణ్ కె., కృష్ణ మంజుష, ఐశ్వర్య వుల్లింగాల, మరియు గురు వెంకటేష్ నటించారు. అవినాష్ కుమార్ జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
7 . కృష్ణం ప్రణయ సఖీ(ఆగస్టు 15 , 2024)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
కృష్ణ (గణేష్) ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది స్టోరీ.
8 . ది మినిస్ట్రీ అఫ్ ఉంగెంతలేమాన్ల్య్ వార్ఫేర్(ఏప్రిల్ 13 , 2024)
A|యాక్షన్,హాస్యం
బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, సైనిక అధికారులు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌పై పోరాడేందుకు అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన సైనికులను రిక్రూట్ చేసుకుంటారు. వారిని ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి నాజీలపైకి పంపుతారు. అప్పుడు వారు ఏం చేశారు? శత్రువులను సాహాసోపేతంగా ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.
9 . గురువాయూర్ అంబలనాదయిల్(మే 16 , 2024)
UA|హాస్యం,డ్రామా
రామచంద్రన్‌కు నిశ్చితార్థం జరిగినప్పటికీ బ్రేకప్ అయిన అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాడు. దీంతో బావమరిది ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్).. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు రామచంద్రన్‌కు సాయం చేస్తుంటాడు. అయితే ఓ వ్యక్తి కారణంగా వీరి బంధం బీటలు వారుతుంది. ఆ తర్వాత ఏమైంది? రామచంద్రన్ పెళ్లి చేసుకున్నాడా? ఆనంద్ తన భార్యను కలిశాడా? లేదా? అన్నది కథ.
10 . స్ట్రీ 2(ఆగస్టు 15 , 2024)
UA|హాస్యం,హారర్
చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ.
11 . మెకానిక్ రాకీ(నవంబర్ 22 , 2024)
UA|యాక్షన్,హాస్యం,డ్రామా
రాకీ (విష్వక్ సేన్) తండ్రి నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేస్తూ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అతడి వద్ద డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? రాంకీ రెడ్డి (సునీల్) వల్ల రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? అన్నది స్టోరీ.
12 . భామాకలాపం 2(ఫిబ్రవరి 16 , 2024)
UA|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
కొత్తగా హోటల్ పెట్టుకున్న అనుపమ (ప్రియమణి) అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? ఆ పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? అన్నది కథ
13 . మత్తు వదలరా 2(సెప్టెంబర్ 13 , 2024)
UA|హాస్యం,డ్రామా
డెలీవరీ బాయ్ ఏజెంట్స్ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? అన్నది స్టోరీ.
14 . మనమే(జూన్ 07 , 2024)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
15 . విక్కీ విద్యా కా వో వాలా వీడియో(అక్టోబర్ 11 , 2024)
UA|హాస్యం,డ్రామా
1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్ నైట్ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
16 . క్రూ(మార్చి 29 , 2024)
UA|హాస్యం,డ్రామా
జాస్మిన్ (కరీనా), గీతా (టబు), దివ్య (కృతి సనన్) కోహినూర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా చేస్తుంటారు. ఆర్థిక సమస్యల వల్ల యాజమాన్యం కొన్ని నెలలుగా వారికి జీతాలు చెల్లించదు. ముగ్గురికి డబ్బు అవసరం పడటంతో దాన్ని సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. చివరికీ ఏమైంది? అన్నది కథ.
17 . ఫ్యామిలీ ప్యాక్(అక్టోబర్ 23 , 2024)
UA|అడ్వెంచర్,హాస్యం,ఫాంటసీ
ఓ కుటుంబంలోని సభ్యులు పాతకాలం నాటి ఓ కార్డ్ గేమ్ ఆడతారు. గేమ్ వల్ల అనుకోకుండా మధ్యయుగం నాటి కాలానికి వెళ్లిపోతారు. అక్కడ తోడేళ్ల నుంచి వారికి సవాళ్లు ఎదురవుతాయి. వాటితో వారు ఎలా పోరాడారు? ప్రస్తుత కాలానికి వారు రాగలిగారా? లేదా? అన్నది స్టోరీ.
18 . రఘు తాతా(సెప్టెంబర్ 13 , 2024)
UA|హాస్యం,డ్రామా
కయళ్ పాండియన్ (కీర్తి సురేష్) మద్రాస్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి. పెళ్లి ఇష్టంలేకపోయిన తాత రఘు కోసం ఒప్పుకుంటుంది. సెల్వన్‌తో నిశ్చితార్థం జరిగాక అతడు వ్యక్తిత్వం ఏంటో తెలిసి షాకవుతుంది. పెళ్లి అడ్డుకునేందుకు కయళ్ ఏం చేసింది? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు కొనితెచ్చుకుంది? అన్నది స్టోరీ.
19 . అయాలన్(జనవరి 12 , 2024)
UA|యాక్షన్,హాస్యం,సైన్స్ ఫిక్షన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.