ZEE5లో బెస్ట్ 10 కామెడీ చిత్రాలు
2k+ views1 year ago
జీ5 ఓటీటీలో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 10 చిత్రాల లిస్ట్ YouSay TFIDB లిస్ట్ చేసింది. వీటిలో రాజ రాజ చోర, సూడిగాడు, వినాయకుడు వంటి కడుపుబ్బ నవ్వించే కామెడీ చిత్రాలు ఉన్నాయి. మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని కామెడీ మోడ్‌ను ఎంజాయ్ చేయండి.
1 . లౌక్యం(సెప్టెంబర్ 26 , 2014)
UA|హాస్యం,డ్రామా
హీరో తన ఫ్రెండ్ కోసం విలన్ చెల్లెల్ని కిడ్నాప్ చేసి వారికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత విలన్ నుంచి తప్పించుకొని నగరానికి వచ్చిన హీరో అక్కడ తొలిచూపులోనే హీరోయిన్‌ను ప్రేమిస్తారు. తీరా ఆమె విలన్ రెండో చెల్లెలు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
2 . గీత గోవిందం(ఆగస్టు 15 , 2018)
UA|హాస్యం,రొమాన్స్
గోవింద్ (విజయ్ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.
3 . బంగార్రాజు(జనవరి 14 , 2022)
UA|హాస్యం,ఫాంటసీ
మనవడి కళ్యాణంతో పాటు, లోక కళ్యాణం కోసం బంగార్రాజు (నాగార్జున)ని కిందికి పంపిస్తాడు యమధర్మరాజు. మరి చిన్న బంగార్రాజు (నాగ చైతన్య), నాగలక్ష్మీ (కృతిశెట్టి)ని ఎలా కలిపాడు? ఊరి గుడిలో ఉన్న నిధులను ఎలా కాపాడాడు? అన్నది కథ.
4 . రౌడీ బాయ్స్(జనవరి 14 , 2022)
UA|హాస్యం,డ్రామా
అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
5 . వరుడు కావలెను(అక్టోబర్ 29 , 2021)
UA|హాస్యం,రొమాన్స్
భూమి (రీతు వర్మ) చాలా పర్టిక్యులర్‌గా ఉండే అమ్మాయి. ఆమె వర్క్ చేసే కంపెనీలోకి ఆకాష్ (నాగ శౌర్య) ఎంటర్ అవుతాడు. ఆ ఇద్దరికీ ఎలా రిలేషన్ కుదిరింది? పెళ్లిపై ఆసక్తి లేని భూమి ఆకాష్‌ను ఇష్టపడుతుందా? లేదా? అన్నది కథ.
6 . అదిరిందయ్యా చంద్రం(ఆగస్టు 20 , 2005)
U|హాస్యం,డ్రామా
చంద్రం, రాజ్యం భార్య భర్తలు, చాలా ఏళ్లుగా అన్యోన్యంగా కాపురం చేస్తుంటారు. చంద్రంకు ప్రమోషన్ రావడంతో హైదరాబాద్‌కు ఒక్కడే వెళ్లాడు. అక్కడ అతను ఓ మోడల్‌తో ప్రేమలో పడటంతో అతని వైవాహిక జీవితం దుర్భరంగా మారుతుంది. మరి చంద్రం చేసిన పనికి రాజ్యం ఏం చేస్తుంది? తిరిగి వీరిద్దరు కలుస్తారా? లేదా? అనేది మిగతా కథ.
7 . సుప్రీమ్(మే 05 , 2016)
UA|యాక్షన్,హాస్యం,డ్రామా,రొమాన్స్
ట్యాక్సీ డ్రైవర్ అయిన హీరోకి ఓ రోజు కష్టాల్లో ఉన్న చిన్న పిల్లవాడు పరిచయం అవుతాడు. కోటీశ్వరుడైన ఆ బాలుడ్ని చంపేందుకు విలన్లు యత్నిస్తుంటారు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? విలన్లకు బాలుడికి సంబంధం ఏంటి? బాలుడ్ని రక్షించడం కోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నది కథ.
8 . అ ఆ(జూన్ 02 , 2016)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
హీరో హీరోయిన్ బావ మరదళ్లు. అయితే వారి కుటుంబాల మధ్య ఓ విషయమై మనస్ఫర్థలు తలెత్తుతాయి. అనుకోకుండా హీరో ఇంటికి వచ్చిన హీరోయిన్ అతడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా లేదా? చివరికీ ఏం జరిగింది? అన్నది కథ.
9 . విలేజె లో వినాయకుడు(నవంబర్ 05 , 2009)
U|హాస్యం
కావ్య లావుగున్న కార్తీక్‌ను ప్రేమిస్తుంది. తన గ్రామంలో ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు కార్తీక్‌ను వెంట తీసుకెళ్తుంది. అయితే వీరి ప్రేమను కావ్య కుటుంబం అంగీకరించదు. ఆమె కుటుంబాన్ని ఆకట్టుకోవడానికి కార్తీక్ చాలా కష్టపడతాడు.
10 . మిరపకాయ్(జనవరి 12 , 2011)
UA|యాక్షన్,హాస్యం
పోలీసు ఆఫీసర్ ఓ మిషన్‌లో భాగంగా లెక్చరర్‌గా కాలేజీలో చేరతాడు. ప్రేమ కోసం ఒకరిని, ప్రొఫెషన్ కోసం ఇంకొకరిని ప్రేమలో పడేస్తాడు.ఆ ఇద్దరిలో హీరో ఎవర్ని చేసుకున్నాడు? అతడు చేపట్టిన మిషన్ సక్సెస్ అయ్యిందా? లేదా? అన్నది కథ.