నందమూరి బాలకృష్ణ.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. కెరీర్‌లో 100కు పైగా సినిమాలు చేసి అప్రతిహతంగా సాగిపోతున్నాడీ నటసింహం. నటనకు మారుపేరు బాలయ్య. పాత్ర ఏదైనా అవలీలగా చేసేస్తాడు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోశాడు. ప్రయోగాత్మక నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. వేశం వేసినా, డైలాగ్ చెప్పినా అది గుర్తుండిపోవాల్సిందే. ప్రేక్షకుల మనసులో నాటుకు పోవాల్సిందే. ఇలా వచ్చిన సినిమాల్లో ఉత్తమమైనవి ఎంచుకోవడం కాస్త కష్టమే. నటన, ప్రేక్షకాదరణ కోణంలో బాలయ్య బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం.

.jpeg)
వైద్యుడిగా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రలు సమర్థవంతంగా పోషించాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్రలో చాలా పవర్‌ఫుల్‌గా నటించాడు. ఎమోషన్స్, డైలాగ్స్ ఇరగదీశాడు.

మోసగాళ్లను మోసం చేసే సూర్య పాత్రలో ఈ సినిమాలో అలరించాడు బాలయ్య. వేషాలు మార్చుతూ విలన్‌ని బురిడీ కొట్టించే తీరు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచాడు నటసింహం. సమరసింహారెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో గుండెకు హత్తుకునేలా నటించాడు.

కృష్ణకుమార్ అనే యువకుడి పాత్రలో నటించాడు బాలకృష్ణ. టైం మిషన్‌తో భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్లినప్పుడు బాలకృష్ణ పరికించే హావభావాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే పనులు మానేసుకుని చూస్తారు.

ఇండస్ట్రీలో గ్లామర్ హీరోగా గుర్తింపు పొందుతున్న సమయంలో బాలకృష్ణ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. భైరవద్వీపం కథను ఎంచుకుని కురూపి(గూని)గా నటించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. యువకుడిగా, వృద్ధుడిగా మెప్పించాడు.