Sun NXTలో యాక్షన్ కామెడీ చిత్రాలు
2k+ views1 year ago
Sun NXTలో 2015నుంచి 2023 వరకు వచ్చిన యాక్షన్ కామెడీ మూవీల్లో టాప్ రేటింగ్‌తో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల జాబితాను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో టెంపర్, PSV గరుడవేగ, తొలిప్రేమ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన చిత్రాన్ని చూసి యాక్షన్‌లో కామెడీని ఎంజాయ్ చేయండి.
1 . ఊపిరి(మార్చి 25 , 2016)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
వీల్‌చైర్‌కే అతుక్కుపోయిన విక్రమ్ ఆదిత్య (నాగార్జున) తన బాగోగులు చూసుకునేందురు శీను (కార్తి)ను నియమించుకుంటాడు. ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయి? ఎవరెవరి జీవితాలు ఎలా మారాయి? అన్నది కథ.
2 . టెంపర్(ఫిబ్రవరి 13 , 2015)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
దయా ఒక అవినీతి పోలీసు అధికారి. వైజాగ్‌కు బదిలీ అయిన తర్వాత అక్కడ వాల్టర్ వాసు అనే గూండాతో చేతులు కలుపుతాడు. అవినీతి మార్గంలో ప్రయాణిస్తాడు. అతని ప్రేయసి కాజల్ అగర్వాల్‌ను అనుకోకుండా వాల్టర్ వాసు కిడ్నాప్ చేయడంతో కథలో ట్విస్ట్ పుడుతుంది
3 . నాన్నకు ప్రేమతో(జనవరి 13 , 2016)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
4 . ధృవ(డిసెంబర్ 09 , 2016)
UA|యాక్షన్,థ్రిల్లర్
ఐపీఎస్ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్).. సిద్ధార్థ్ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ.
5 . జై లవ కుశ(సెప్టెంబర్ 21 , 2017)
UA|యాక్షన్
విధివశాత్తు విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు తిరిగి కలిసినప్పుడు వారి మధ్య.. ప్రేమ, వంచన, ప్రతీకారం వంటి భావోద్వేగ కుటుంబ బంధాన్ని ఈ సినిమా కథ పరీక్షిస్తుంది.
6 . తొలి ప్రేమ(ఫిబ్రవరి 10 , 2018)
UA|హాస్యం,రొమాన్స్
ఆదిత్య (వరుణ్ తేజ్) రైలులో వర్ష (రాశీఖన్నా)ను చూసి ప్రేమిస్తాడు. తాను చదువుతున్న ఆమె కాలేజీకే రావడంతో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాలేజీలో జరిగిన ఓ గొడవ మూలంగా ఆదిత్య వర్షను వదిలి వెళ్లిపోతాడు. ఆరేళ్ల తర్వాత వర్ష మళ్లీ ఆదిత్య జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరు కలిశారా లేదా? అన్నది కథ.
7 . సోగ్గాడే చిన్ని నాయనా(జనవరి 15 , 2016)
UA|హాస్యం,డ్రామా
బంగార్రాజు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. కొడుకు కాపురం గురించి ఆందోళన చెందుతున్న భార్య కోసం తిరిగి భూమి పైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భూమిపైకి వచ్చిన బంగర్రాజు ఆత్మ ఏం చేసింది? అన్నది కథ.
8 . పెళ్లి చూపులు(జూలై 29 , 2016)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
9 . మరకథమణి(జూన్ 16 , 2017)
U|హాస్యం,రొమాన్స్
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానితో ప్రేమలో పడతాడు. అయితే, ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అతను మరకతమణి అనే రత్నం గురించి తెలుసుకుంటాడు. దానిని పొందేక్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. ఇంతకు అతను మరకథమణిని సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
10 . గోపాల గోపాల(జనవరి 10 , 2015)
U|హాస్యం,డ్రామా
నాస్తికుడైన గోపాల రావు తన దుకాణం భూకంపంలో ధ్వంసం కావడంతో దేవుడిపై దావా వేస్తాడు, ఫలితంగా దేవుడు, గోపాలరావు మధ్య జరిగే కొన్ని సంఘటనలు జీవిత పాఠాలను నేర్పుతాయి.
11 . పటాస్(జనవరి 23 , 2015)
A|యాక్షన్,రొమాన్స్
అవినీతిపరుడైన పోలీస్ అధికారి కళ్యాణ్ సిన్హా.... హైదరాబాద్‌కు ట్రాన్సఫర్ అవుతాడు. అక్కడ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బు సంపాధిస్తుంటాడు. ఇది డీజీపీ సాయి కుమార్‌కు పెద్ద తలనొప్పిగా మారుతుంది.
12 . భీష్మ(ఫిబ్రవరి 21 , 2020)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ ఉద్యోగి అయిన చైత్ర(రష్మిక)ను భీష్మ(నితిన్) ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించే క్రమంలో సేంద్రీయ వ్యవసాయంపై ఇష్టం పెంచుకుంటాడు. ఇదే సమయంలో భీష్మ ఆర్గానిక్స్‌కు ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ కంపెనీతో ఏ సంబంధం లేని భీష్మ ఎలా పరిష్కరించాడు అనేది కథ.
13 . PSV గరుడ వేగ(నవంబర్ 03 , 2017)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
శేఖర్ ఒక NIA ఆఫీసర్. తన గుర్తింపును రహస్యంగా ఉంచుతాడు. ఈ క్రమంలో హ్యాకర్(అదిత్) వద్ద ఉన్న కీలకమైన డెటా సమాచారాన్ని కనుగొనేందుకు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తాడు.
14 . వరుణ్ డాక్టర్(అక్టోబర్ 09 , 2021)
UA|యాక్షన్,థ్రిల్లర్
వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతను పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడతాడు, కానీ ఆమె అతని ప్రాక్టికల్ స్వభావాన్ని చూసి తిరస్కరిస్తుంది. పద్మిని మేనకోడలు కిడ్నాప్ అయినప్పుడు.. కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
15 . బెంగాల్ టైగర్(డిసెంబర్ 10 , 2015)
UA|యాక్షన్,రొమాన్స్
ఆకాశ్(రవి తేజ) తనను ఇష్టపడే మహిళను ఇంప్రెస్ చేయడానికి సెలబ్రెటీగా మారాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను రాజకీయ నాయకుడిని రాయితో కొట్టి అతని దగ్గరే పనిచేస్తాడు. అయితే మొదట ఫేమస్ కావాలని ఇదంతా చేసినా... అతని లక్ష్యం వేరుగా ఉంటుంది. ఇంతకు ఆకాశ్ లక్ష్యం ఏమిటి? అన్నది మిగతా కథ.
16 . జెంటిల్‌మన్(జూన్ 17 , 2016)
U|యాక్షన్,రొమాన్స్,థ్రిల్లర్
ఇద్దరు మహిళలు వేర్వేరు సందర్భాల్లో ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అన్నది కథ.
17 . కృష్ణ గాడి వీర ప్రేమ గాధ(ఫిబ్రవరి 12 , 2016)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
కృష్ణ (నాని), మహాలక్ష్మి (మెహ్రీన్) ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రేమించుకుంటుంటారు. అయితే వీరి ప్రేమకు ఫ్యాక్షన్ గొడవలు అడ్డుగా మారాయి. వాటిని ఎదుర్కొని హీరో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అన్నది కథ.
18 . సరైనోడు(ఏప్రిల్ 22 , 2016)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వస్తాడు. నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ది చెబుతుంటాడు. ఈ క్రమంలో వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వైరం ధనుష్ (ఆది)ని హీరో ఎలా ఎదిరించాడు? అతడికి హీరోకు మధ్య గొడవేంటి? అన్నది కథ.
19 . జిల్(మార్చి 27 , 2015)
A|యాక్షన్,డ్రామా
జై అనే సిన్సియర్ ఫైర్ ఆఫీసర్ తన కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అతను సావిత్రితో ప్రేమలో పడతాడు. ఆమెతో హాయిగా గడుపుతున్న క్రమంలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ మధ్య ఓ విషయంలో గొడవ జరుగుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన చిన్న మనస్పర్థలు పెద్ద యుద్ధానికి దారితీస్తుంది.
20 . విజేత(జూలై 12 , 2018)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
ఉద్యోగం చేయకుండా ఆవారాగా తిరిగే హీరో తన కోసం తండ్రి చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. తర్వాత అతడు ఏం చేశాడు? ఎలా ప్రయోజకుడిగా మారాడు? అన్నది కథ.
21 . జ్యో అచ్యుతానంద(సెప్టెంబర్ 09 , 2016)
U|డ్రామా,రొమాన్స్,హాస్యం
ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆమె కూడా ఇద్దరితోనూ ఎంతో అనురాగంగా ఉంటుంది. చివరికీ ఏమైంది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి ముగింపు లభించింది? అన్నది కథ.
22 . పైసా వసూల్(సెప్టెంబర్ 01 , 2017)
UA|యాక్షన్,డ్రామా
గూఢచార సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి ఒక మాఫియా నాయకుడిని పట్టుకోవడానికి ఒక పెద్ద మిషన్ కోసం స్థానిక గ్యాంగ్‌స్టర్‌ని నియమిస్తాడు. మరి ఆ గ్యాంగ్ స్టార్ మాఫియా డాన్‌ను పట్టుకున్నాడా? లేదా అనేది కథ.
23 . డిస్కో రాజా(జనవరి 24 , 2020)
UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ
24 . కాటమరాయుడు(మార్చి 24 , 2017)
UA|యాక్షన్,హాస్యం,రొమాన్స్
పవన్ కల్యాణ్ తన కుటుంబం మరియు గ్రామం కోసం నిలబడే ఓ ధైర్యశాలి వ్యక్తిగా ప్రధాన పాత్ర పోషించారు. గ్రామంలో తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అవంతిక అనే యువతి అతని జీవితంలోకి రావడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
25 . హలో(డిసెంబర్ 22 , 2017)
U|యాక్షన్,డ్రామా,రొమాన్స్
శీను తన చిన్నతనంలో జున్నును ప్రేమిస్తాడు. కానీ విధి వారిని వేరు చేస్తుంది. శీను పెద్దవాడయ్యాక.. జున్ను ఎక్కడ ఉందో ఫొన్ కాల్ ద్వారా క్లూ పొందుతాడు. ఈ క్రమంలో అతని ఫోన్ పోవడంతో కథ మలుపు తిరుగుతుంది.
26 . కృష్ణం ప్రణయ సఖీ(ఆగస్టు 15 , 2024)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
కృష్ణ (గణేష్) ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది స్టోరీ.
27 . ఆక్సిజన్(నవంబర్ 30 , 2017)
UA|యాక్షన్,రొమాన్స్
అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ
28 . ఉంగరాల రాంబాబు(సెప్టెంబర్ 15 , 2017)
UA|హాస్యం,రొమాన్స్
ఉంగరాల రాంబాబు క్రాంతి మాధవ్ రచన మరియు దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రం మరియు పరుచూరి కిరీటి నిర్మించారు. ఇందులో సునీల్, మియా, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 15 సెప్టెంబర్ 2017న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
29 . శ్రీరస్తు శుభమస్తు(ఆగస్టు 05 , 2016)
UA|డ్రామా,రొమాన్స్,హాస్యం
ధనవంతుడు అయిన హీరో పేదింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. సాధారణ అబ్బాయిగా ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
30 . లాల్ సలామ్(ఫిబ్రవరి 09 , 2024)
UA|యాక్షన్,డ్రామా
హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులుగా ఉంటారు. కొంత కాలం ఒకే జట్టుకు ఆడినప్పటికీ.. వారిలో ఒకరు కొత్త టీమ్‌ను స్థాపిస్తారు. దీంతో రెండు జట్లు రెండు మతాలకు ప్రాతినిథ్యం వహించడం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో ఓ మ్యాచ్ ఆ ఇద్దరు క్రికెటర్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. అప్పుడు ముస్లిం క్రికెటర్ తండ్రి (రజనీ) ఏం చేశాడు? అన్నది కథ.