• TFIDB EN
  • చిరంజీవి
    ప్రదేశం: పశ్చిమ గోదావరి, మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్
    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన చిరంజీవిగారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో అంజనాదేవి, వెంకట్‌రావు దంపతులకు 1955 ఆగస్టు 22న ఆయన జన్మించారు. చిరంజీవి అంజనేయుడి భక్తుడు. ఓసారి హనుమంతుడు తన కళ్లో కనబడి చిరంజీవిగా వర్ధిల్లమని దీవించాడని అందుకే తన పేరును శివశంకర వరప్రసాద్‌ నుంచి చిరంజీవిగా మార్చుకున్నట్లు ప్రచారంలో ఉంది.

    చిరంజీవి వయసు ఎంత?

    చిరంజీవి వయసు 69 సంవత్సరాలు

    చిరంజీవి ముద్దు పేరు ఏంటి?

    చిరు, మెగా స్టార్, సుప్రీమ్ హీరో, అన్నయ్య

    చిరంజీవి ఎత్తు ఎంత?

    5'7"(173cm)

    చిరంజీవి అభిరుచులు ఏంటి?

    చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు.

    చిరంజీవి ఏం చదువుకున్నారు?

    చిరంజీవి ఇంటర్మిడియట్‌ను సీఎస్‌ఆర్ కాలేజ్, ఒంగోలులో చేయగా బీకామ్ డిగ్రీని శ్రీ వైఎన్ కాలేజ్, నర్సాపురంలో పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్ ఫిల్మ్‌ ఇన్సిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేశారు.

    చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    నాగార్జున, రజినీకాంత్, మోహన్ బాబు, సుధాకర్ చిరంజీవికి మంచి స్నేహితులు

    చిరంజీవి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    చిరంజీవి ఇప్పటి వరకు 150 సినిమాలకు పైగా నటించారు.

    చిరంజీవి In Sun Glasses

    చిరంజీవి Childhood Images

    చిరంజీవి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on Instagram
     

    Chiranjeevi Viral Video

    Description of the image
    Editorial List
    కొరటాల శివ హిట్ చిత్రాలు
    చిరంజీవి టాప్ కామెడీ సినిమాల లిస్ట్‌ ఇదేEditorial List
    చిరంజీవి టాప్ కామెడీ సినిమాల లిస్ట్‌ ఇదే
    మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?Editorial List
    మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?

    చిరంజీవి తల్లిదండ్రులు ఎవరు?

    చిరంజీవి కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు పెద్ద కుమారునిగా జన్మించాడు. ఆయనకి ఇద్దరు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముళ్లు. తెలుగు సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి చిన్న తమ్ముడు. నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పెద్ద తమ్ముడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి కుమారుడు. వరుణ్ తేజ్‌కు పెద్దనాన్న. సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్‌, అల్లు అర్జున్ లకు మామయ్య.

    చిరంజీవి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు, విజయ్ దుర్గ, మాధవి రావు

    చిరంజీవి పెళ్లి ఎప్పుడు అయింది?

    ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980 ఫిబ్రవరి 20న పెళ్లి చేసుకున్నారు.

    చిరంజీవి కు పిల్లలు ఎంత మంది?

    చిరంజీవికి ముగ్గురు సంతానం. రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ

    చిరంజీవి Family Pictures

    చిరంజీవి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    చిరంజీవి స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ ఆయన్ను ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా చిరంజీవి యూనిక్ డ్యాన్సింగ్ స్టైల్‌కు కల్ట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించి పెట్టింది. మాస్‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను అందించింది.

    చిరంజీవి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో చిరంజీవి ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిరంజీవి తొలి చిత్రం ఏది?

    చిరంజీవి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    చిరంజీవి తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ఒక్క పాత్ర ప్రత్యేకమైనది అని చెప్పలేం. కానీ ఖైదీ, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రీ, ఇంద్ర, ఠాగూర్సినిమాల్లో ఆయన చేసిన క్యారెక్టర్లు అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

    చిరంజీవి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Chiranjeevi Best Dialogue

    చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంత?

    చిరంజీవి ఒక్కో చిత్రానికి రూ.50 కోట్ల నుంచి రూ.70కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    చిరంజీవి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    బొమ్మడాయిల పులుసు, చిన్న చెపల్లో చింతకాయ వేసి వండితే ఇష్టంగా తింటారు.

    చిరంజీవి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    చిరంజీవి కు ఇష్టమైన నటి ఎవరు?

    చిరంజీవి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    చిరంజీవి ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    చిరంజీవి ఫెవరెట్ సినిమా ఏది?

    చిరంజీవి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్

    చిరంజీవి కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    చిరంజీవి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Rolls Royce Phantom(11Cr) Toyota Land Cruiser Mercedes-Benz G63 AMG Land Rover Range Rover Range Rover Vogue

    చిరంజీవి ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    చిరంజీవి మొత్తం ఆస్తుల విలువ GQ సంస్థ 2022 డెటా ప్రకారం రూ. 1650 కోట్లు. ఇందులో ఆయన పెట్టుబడులు, వ్యాపారాలు, బంగారం, విలువైన వస్తువులు, స్థిర చరాస్తులు ఉన్నాయి.

    చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    చిరంజీవి సోషల్‌ మీడియా లింక్స్‌

    చిరంజీవి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో ముఖ్యమైన అవార్డులను అందుకున్నారు. స్వయంకృషి, ఆపాద్బంధవుడు, ఇంద్ర చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు. శుభలేఖ, విజేత, ఆపాద్బంధవుడు, ముఠా మేస్త్రీ, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్‌దాదా MBBS చిత్రాలకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందారు. సినీరంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా ఆయన్ను వరించింది.

    చిరంజీవి కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    చిరంజీవి తన ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను స్వచ్ఛందంగా నడుపుతున్నారు. ఏటా కొన్ని వేలమంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు రక్తదానం చేస్తుంటారు.

    చిరంజీవి ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    శుభగృహ హోమ్స్‌కు చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు.

    చిరంజీవి కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    2008-016 వరకు ఆయన సినిమాలకు విరామం పలికి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర పర్యాటక మంత్రిగా కొనసాగారు. సమకాలిన రాజకీయాల్లో ఇమడలేక తిరిగి సినిమాల్లోకి ప్రవేశించారు.
    చిరంజీవి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే చిరంజీవి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree