• TFIDB EN
  • Editorial List
    తెలుగులో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ -10 చిత్రాలు
    Dislike
    10+ views
    2 months ago

    ఏ సినిమా విడుదలైన మార్కెట్‌లో కొన్ని లెక్కలుంటాయి. దాని ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎన్ని కోట్లు? అంటు గణిస్తుంటారు. ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే విడుదలకు ముందు ఎన్ని కోట్లకు సినిమా అమ్ముడు పోయింది అని అర్థం. అలా తెలుగులో ఇప్పటి వరకు అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ 10 చిత్రాలు మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
    UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
    2 . దేవర(సెప్టెంబర్ 27 , 2024)
    UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్‌ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్‌) ఎందుకు భయస్తుడిగా మారాడు? అన్నది స్టోరీ. దేవర చిత్రాన్ని రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.
    3 . సైరా నరసింహా రెడ్డి(అక్టోబర్ 02 , 2019)
    UA|170 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
    4 . రాధే శ్యామ్(మార్చి 11 , 2022)
    UA|138 minutes|రొమాన్స్,డ్రామా
    విక్రమాదిత్య (ప్రభాస్‌) పేరు మోసిన జ్యోతిషుడు. ప్రేరణ (పూజా హెగ్డే)ను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. కానీ ప్రేమించలేని పరిస్థితి. మరి విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది? వారు ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? అన్నది కథ.
    5 . ఆదిపురుష్(ఆగస్టు 11 , 2023)
    UA|179 minutes|యాక్షన్,అడ్వెంచర్,మైథలాజికల్
    ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
    6 . సాహో(ఆగస్టు 30 , 2019)
    UA|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
    వాజీ అనే నగరం కేంద్రంగా గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలను సిండికేట్‌గా రాయ్( జాకీ ష్రాప్) నిర్వహిస్తుంటాడు. అండర్‌వరల్డ్‌ను చేజిక్కించుకోవాలని దేవరాజ్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రాయ్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత అతని కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్‌లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ
    7 . సలార్(డిసెంబర్ 22 , 2023)
    UA|177 minutes|థ్రిల్లర్,యాక్షన్
    ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.
    8 . బాహుబలి 2: ది కన్‌క్లూజన్(ఏప్రిల్ 28 , 2017)
    UA|171 minutes|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి తన వారసత్వం గురించి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించేందుకు.. భళ్లాలదేవుడితో యుద్ధంలో పోరాడుతాడు.
    9 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
    UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్
    కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
    10 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
    UA|182 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.

    @2021 KTree