• TFIDB EN
  • Editorial List
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    Dislike
    2k+ views
    11 months ago

    తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్‌ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . వీర సింహా రెడ్డి(జనవరి 12 , 2023)
    UA|172 minutes|యాక్షన్,డ్రామా
    వీర సింహా రెడ్డి చిత్రంలో బాలయ్య తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ ప్రజలకు దేవుడు. ఆయనకు సవతి తల్లి కూతురు భానుమతి( వరలక్ష్మి) అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైన త్యాగం చేస్తాడు. కానీ భానుమతి బాలయ్య చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు జూ. బాలయ్య విదేశాల్లో తన తల్లితో ఉంటాడు. అసలు వీరసింహారెడ్డి తన కుటుంబానికి ఎందుకు దూరమవుతాడు? ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు ఎందుకు చంపాలనుకుంటుంది అనేది కథ

    గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.

    2 . అఖండ(డిసెంబర్ 02 , 2021)
    UA|167 minutes|యాక్షన్,డ్రామా
    మురళీకృష్ణ(బాలకృష్ణ) ఊరి పెద్దగా ఉంటూ పేదవారికి బాసటగా నిలుస్తుంటాడు. వరద రాజులు (శ్రీకాంత్‌) ఆ ఊరిలో యూరేనియం తవ్వకాలు ప్రారంభిస్తాడు. దాని వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ క్రమంలో మురళీకృష్ణ ఏం చేశాడు? అతడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు అఖండ ఎవరు? మైనింగ్‌ మాఫియాకు ఎలా అడ్డుకట్ట వేశాడు? అన్నది కథ.

    బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది.

    3 . లెజెండ్(మార్చి 28 , 2014)
    A|161 minutes|యాక్షన్,డ్రామా
    ఇండియాకు వచ్చిన కృష్ణ (బాలకృష్ణ) ఓ సందర్భంలో జితేందర్‌ (జగపతిబాబు) కొడుకుతో గొడవపడతాడు. దీంతో హీరోను చంపాలని వెళ్లిన జితేందర్‌ అతడ్ని చూసి షాక్ అవుతాడు. జితేందర్‌కు కృష్ణకు ఇంతకు ముందే పరిచయం ఉందా? కథలో జయదేవ్‌ (సీనియర్ బాలకృష్ణ) పాత్ర ఏంటి? అన్నది కథ.

    బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్‌ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు.

    4 . అధినాయకుడు(జూన్ 01 , 2012)
    A|151 mins|యాక్షన్,రొమాన్స్
    హరిశ్చంద్ర ప్రసాద్ రాయలసీమలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. దీన్ని అడ్డుకునేందుకు విలన్లు కుట్రలు పన్నుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు.

    5 . పరమ వీర చక్ర(జనవరి 12 , 2011)
    UA|యాక్షన్,డ్రామా
    మేజర్‌ జయసింహా క్రూరమైన ఉగ్రవాదిని పట్టుకుంటాడు. అయితే ఉగ్రవాదులు, కొందరు ఆర్మీ అధికారులు పన్నిన కుట్రకు బలై ఆస్పత్రిలో చేరతాడు. అతడిలాగే ఉండే చక్రధర్‌ జయసింహా స్థానంలోకి వస్తాడు. అప్పుడు చక్రధర్ ఏం చేశాడు? అన్నది కథ.

    దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు.

    6 . సింహ(ఏప్రిల్ 30 , 2010)
    A|156 minutes|యాక్షన్
    శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్. అతని కాలేజీలోకి జానకి అనే యువతి కొత్తగా చేరుతుంది. శ్రీమన్నారాయణను చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడుతుంది. అయితే జానకి గతం.. శ్రీమన్నారయణ తండ్రి గతంతో లింక్ అయి ఉంటుంది. ఇంతకు జానకి ఎవరు? శ్రీమన్నారాయణ తండ్రి గతం ఏమిటి అన్నది మిగతా కథ.

    మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది.

    7 . పాండురంగడు(మే 30 , 2008)
    UA|156 minutes|డ్రామా
    పుండరీకుడు స్త్రీ లోలుడు. తల్లిదండ్రులు, భార్యను పట్టించుకోకుండా ఓ వేశ్య చుట్టూ తిరుగుతుంటాడు. అయితే ఆమె పుండరీకుడిపై విష ప్రయోగం చేస్తుంది. దాని నుంచి పుండరీకుడు ఎలా బయటపడ్డాడు? తన తప్పు తెలుసుకొని ఏం చేశాడు? అన్నది కథ.

    కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు.

    8 . ఒక్క మగాడు(జనవరి 10 , 2008)
    A|178 minutes|డ్రామా
    రాము ఓ జంటకు పెళ్లి చేస్తాడు. పెళ్లి కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కావడంతో అతడి దృష్టి రాముపై పడుతుంది. మరోవైపు అచ్చం రాములాగే ఉండే వృద్ధుడు అవినీతి పరులను హత్య చేస్తుంటాడు. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరు? రాముకి అతడికి సంబంధం ఏంటి? సీఎం కుట్రలను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ.

    బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు.

    9 . అల్లరి పిడుగు(అక్టోబర్ 05 , 2005)
    U|171 minutes|డ్రామా
    రంజిత్‌, గిరి కవల సోదరులు. రంజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ అయ్యి క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతుంటాడు. గిరి సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. జీకే అనే డాన్‌.. రంజిత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు గిరి తన సోదరుడితో కలుస్తాడు.

    జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు.

    10 . చెన్నకేశవ రెడ్డి(సెప్టెంబర్ 25 , 2002)
    UA|145 minutes|యాక్షన్,డ్రామా
    చెన్నకేశవ రెడ్డి 22 ఏళ్లుగా చేయని నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. ఓ జైలర్‌ సాయంతో విడుదలై తనను ఇరిక్కించిన వారిపై పగ తీర్చుకునేందుకు రాయలసీమకు వెళ్తాడు. పోలీసు అయిన చెన్నకేశవ రెడ్డి కుమారుడు తండ్రి నేర కార్యక్రమాలకు అడ్డు తగులుతుంటాడు. తన తండ్రి గతం తెలుసుకొని చివరికీ అతడికి సాయం చేస్తాడు.

    మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు.

    11 . సుల్తాన్(మే 27 , 1999)
    U|143 minutes|యాక్షన్
    సుల్తాన్‌ అనే ఉగ్రవాదిని పట్టుకునే బాధ్యత అశోక్ అనే పోలీసు ఆఫీసర్‌కు అప్పగించబడుతుంది. మారువేషంలో తిరుగుతున్న సుల్తాన్‌ను పట్టుకునేందుకు అశోక్‌ అనేక ప్లాన్‌లు వేస్తారు. చివరికి సుల్తాన్‌లా ఉన్న అతడి కవల సోదరుడు పృథ్వీని అరెస్టు చేయడంతో కథ మలుపు తిరుగుతుంది.

    శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్‌ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్‌ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు.

    12 . పెద్దన్నయ్య(జనవరి 10 , 1997)
    U|146 minutes|డ్రామా
    రామకృష్ణ ప్రసాద్‌ తన తమ్ముళ్లందరినీ సెటిల్‌ చేయాలని ఆకాంక్షిస్తుంటాడు. అతడి చిన్న తమ్ముడు ఓ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నప్పుడు కథ మలుపు తిరుగుతుంది.

    బాలకృష్ణ డ్యూయల్ రోల్‌ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు.

    13 . శ్రీ కృష్ణార్జున విజయం(మే 15 , 1996)
    U|157 minutes|డ్రామా,ఫాంటసీ
    ఈ చిత్రం మహాభారతంలోని పాంచాలి పరిణయం అనే ఒక చిన్న భాగం ఆధారంగా రూపొందింది. ఇందులో బాలకృష్ణ.. శ్రీకృష్ణుడు, అర్జునుడిగా ద్విపాత్రిభినయం చేశారు. ద్రౌపదిగా రోజా చేసింది.

    సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు.

    14 . మాతో పెట్టుకోకు(జూలై 28 , 1995)
    U|147 min|యాక్షన్,హాస్యం
    ఎస్పీ అర్జున్‌, అతడి కవల సోదరుడు కిట్టయ్య నేరస్తులను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే వారికి ఒక గ్యాంగ్‌స్టర్ సవాలు విసురుతాడు. వారిద్దరూ అతడ్ని ఎలా అంతం చేశారన్నది కథ.

    ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు.

    15 . ఆదిత్య 369(జూలై 18 , 1991)
    U|141 minutes|అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
    అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ

    ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు.

    16 . బ్రహ్మర్షి విశ్వామిత్ర(ఏప్రిల్ 19 , 1991)
    U|148 minutes|డ్రామా,మ్యూజికల్
    విశ్వామిత్రుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎన్‌టీఆర్‌ విశ్వమిత్రుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారానే తారక్‌ బాలనటుడిగా అరంగేట్రం చేశారు.

    నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

    17 . రాముడు భీముడు(నవంబర్ 17 , 1988)
    U|141 minutes|డ్రామా
    రాముడు భీముడు 1988 తెలుగు భాషా నాటకీయ చిత్రం, సత్యం సినీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై CHVV సత్యనారాయణ నిర్మించారు మరియు K. మురళీ మోహనరావు దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ, రాధ, సుహాసిని నటించారు మరియు చక్రవర్తి సంగీతం సమకూర్చారు.

    రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు.

    18 . అపూర్వ సహోదరులు(అక్టోబర్ 21 , 1949)
    UA|అడ్వెంచర్,డ్రామా
    కవలలు విజయన్, విక్రమన్ పుట్టుకతోనే విడిపోతారు. పెద్దయ్యాక తమ తల్లిదండ్రులు ఎలా చనిపోయారన్న విషయాన్ని వైద్యుడి ద్వారా తెలుసుకుంటారు. వారిద్దరూ ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరుతారు.

    బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు.


    @2021 KTree